8 "మా ఇద్దరికి కలలు వచ్చాయి కానీ వాటి భావం చెప్పడానికి ఎవరు లేరు" అని వారు జవాబిచ్చారు.
అప్పుడు యోసేపు వారితో, "భావాలు చెప్పడం దేవుని వశం కాదా? మీ కలలు నాకు చెప్పండి" అని అన్నాడు.
12 యోసేపు అతనితో, "దాని అర్థం ఇది. మూడు తీగెలు మూడు రోజులు. 13 మూడు రోజుల్లో ఫరో నీ తల పైకెత్తి నీ స్థానం నీకు మరలా ఇస్తాడు, గతంలో నీవు గిన్నె అందించే వానిగా ఉన్నప్పుడు చేసినట్టు, ఫరో గిన్నెను అతనికి చేతికి అందిస్తావు.
18 యోసేపు అన్నాడు, "దాని అర్థం ఇది. మూడు గంపలు మూడు రోజులు. 19 మూడు రోజుల్లో ఫరో నీ తలను తీసివేసి, నీ శరీరాన్ని స్తంభానికి వ్రేలాడదీస్తాడు. పక్షులు నీ మాంసం తినివేస్తాయి."