హెచ్చరిక. ఈజిప్టు విడిచి వచ్చిన తరం అపనమ్మకం వల్లనే కనాను విశ్రాంతిలోకి ప్రవేశించలేక పోయారు
7 కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా,
"ఈ రోజు మీరు ఆయన మాట విన్నట్టయితే
8 అరణ్యంలో శోధన ఎదురైనప్పుడు
తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల్లాగా
మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు.
12 సోదరులారా, సజీవుడైన దేవుని నుండి తొలగిపోయే హృదయం, అవిశ్వాసంతో నిండిన చెడ్డ హృదయం మీలో ఉండకుండాా జాగ్రత్త పడండి. 13 పాపపు వంచన వల్ల మీలో ఎవరూ కఠినులు కాకుండా ప్రతిరోజూ, ఈ రోజు అనే సమయం ఉండగానే ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. 15 దీని గూర్చి మొదటే ఇలా చెప్పారు.
"ఈ రోజే మీరు ఆయన స్వరం వింటే,
ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసినట్టు
మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు."