విశ్వాసంలేనివారికి హెచ్చరిక
7 కాబట్టి, పరిశుద్ధాత్మ చెప్పినట్లు:
"నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే,
8 అరణ్యంలో శోధన సమయంలో,
మీరు తిరుగుబాటు చేసిన విధంగా,
మీ హృదయాలను కఠినం చేసుకోకండి;
12 కాబట్టి సహోదరీ సహోదరులారా, జీవంగల దేవుని నుండి దూరంచేసే పాప స్వభావం, అవిశ్వాసపు హృదయం మీలో ఎవరికి ఉండకుండ జాగ్రత్తగా చూసుకోండి. 13 పాపం యొక్క మోసంచేత మీలో ఎవరూ కఠినపరచబడకుండ ఉండడానికి, నేడు అని పిలువబడుతున్న దినం ఉండగానే మీరు ప్రతిదినం ఒకరినొకరు ధైర్యపరచుకొంటూ ఉండండి. 15 ఇప్పుడే చెప్పబడినట్లుగా,
"నేడు, ఆయన స్వరాన్ని మీరు వింటే,
మీరు తిరుగుబాటులో చేసినట్టుగా
మీ హృదయాలను కఠినం చేసుకోకండి."3:15 కీర్తన 95:7,8