Pular para o conteúdo
Publicidade

యెషయా 41:10,13,14

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

10 నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను.

నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి.

దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను.

నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను.

13 నీ దేవుణ్ణి అయిన యెహోవా అనే నేను, ‘భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను’ అని చెబుతూ నీ కుడిచేతిని పట్టుకున్నాను.

14 పురుగులాంటి యాకోబూ, అల్పమైన ఇశ్రాయేలూ, ‘భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను’" అని యెహోవా సెలవిస్తున్నాడు.

ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే నీ విమోచకుడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    10 కాబట్టి భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను;

    దిగులుపడకు, నేను నీ దేవుడను.

    నేను నిన్ను బలపరచి నీకు సహాయం చేస్తాను;

    నీతిగల నా కుడిచేతితో నిన్ను ఆదరిస్తాను.

    13 నీ దేవుడనైన యెహోవాను,

    నేను నీ కుడిచేతిని పట్టుకుని,

    భయపడకు అని

    నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాను.

    14 భయపడకు, పురుగులాంటి యాకోబూ!

    కొద్ది మందిగా ఉన్న ఇశ్రాయేలూ, భయపడకు.

    నేను నీకు సహాయం చేస్తాను" అని నీ విమోచకుడు

    ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా చెప్తున్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.