10 కాబట్టి భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను;
దిగులుపడకు, నేను నీ దేవుడను.
నేను నిన్ను బలపరచి నీకు సహాయం చేస్తాను;
నీతిగల నా కుడిచేతితో నిన్ను ఆదరిస్తాను.
13 నీ దేవుడనైన యెహోవాను,
నేను నీ కుడిచేతిని పట్టుకుని,
భయపడకు అని
నేను నీకు సహాయం చేస్తానని చెప్తున్నాను.
14 భయపడకు, పురుగులాంటి యాకోబూ!
కొద్ది మందిగా ఉన్న ఇశ్రాయేలూ, భయపడకు.
నేను నీకు సహాయం చేస్తాను" అని నీ విమోచకుడు
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా చెప్తున్నారు.