Pular para o conteúdo
Publicidade

యెషయా 43:1,2,18,19

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

రక్షకుడు యెహోవా దేవుడు మాత్రమే

1 అయితే యాకోబూ, నిన్ను పుట్టించిన యెహోవా, ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఇలా చెబుతున్నాడు,

"నేను నిన్ను విమోచించాను, భయపడకు. నిన్ను పేరుపెట్టి పిలుచుకున్నాను. నువ్వు నా సొత్తు.

2 నువ్వు ప్రవాహాలను దాటేటప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను.

నదులగుండా వెళ్ళేటప్పుడు అవి నిన్ను ముంచివేయవు.

నువ్వు అగ్నిగుండా నడచినా కాలిపోవు, జ్వాలలు నీకు కీడు చేయవు

18 "గతంలో జరిగిన సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలపు సంగతులను ఆలోచించవద్దు.

19 ఇదిగో, నేనొక కొత్త కార్యం చేస్తున్నాను. అది ఇప్పటికే మొదలైంది. మీరు దాన్ని గమనించరా?

నేను అరణ్యంలో దారి నిర్మిస్తాను. ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాను.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 అయితే యాకోబూ, నిన్ను సృజించిన యెహోవా

    ఇశ్రాయేలూ, నిన్ను రూపించినవాడు

    ఇలా చెప్తున్నారు:

    "భయపడకు నేను నిన్ను విడిపించాను.

    పేరు పెట్టి నిన్ను పిలిచాను; నీవు నా వాడవు.

    2 నీవు నీళ్లను దాటుతున్నప్పుడు

    నేను నీతో ఉంటాను;

    నీవు నదులను దాటుతున్నప్పుడు

    అవి నిన్ను ముంచవు.

    నీవు అగ్ని గుండా నడుస్తున్నప్పుడు

    నీవు కాలిపోవు.

    మంటలు నిన్ను కాల్చవు.

    18 "పూర్వ విషయాల్ని మరచిపోండి;

    గత సంగతులను ఆలోచించకండి.

    19 చూడండి, నేను ఒక క్రొత్త పని చేస్తున్నాను!

    ఇప్పుడే అది మొలకెత్తుతుంది; మీరు దానిని గ్రహించలేదా?

    నేను అరణ్యంలో దారి కలుగజేస్తున్నాను,

    ఎడారిలో నదులు ప్రవహించేలా చేస్తున్నాను.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.