ఇశ్రాయేలు యొక్క ఏకైక రక్షకుడు
1 అయితే యాకోబూ, నిన్ను సృజించిన యెహోవా
ఇశ్రాయేలూ, నిన్ను రూపించినవాడు
ఇలా చెప్తున్నారు:
"భయపడకు నేను నిన్ను విడిపించాను.
పేరు పెట్టి నిన్ను పిలిచాను; నీవు నా వాడవు.
2 నీవు నీళ్లను దాటుతున్నప్పుడు
నేను నీతో ఉంటాను;
నీవు నదులను దాటుతున్నప్పుడు
అవి నిన్ను ముంచవు.
నీవు అగ్ని గుండా నడుస్తున్నప్పుడు
నీవు కాలిపోవు.
మంటలు నిన్ను కాల్చవు.
18 "పూర్వ విషయాల్ని మరచిపోండి;
గత సంగతులను ఆలోచించకండి.
19 చూడండి, నేను ఒక క్రొత్త పని చేస్తున్నాను!
ఇప్పుడే అది మొలకెత్తుతుంది; మీరు దానిని గ్రహించలేదా?
నేను అరణ్యంలో దారి కలుగజేస్తున్నాను,
ఎడారిలో నదులు ప్రవహించేలా చేస్తున్నాను.