Pular para o conteúdo
Publicidade

యెషయా 7:10-14

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

10 యెహోవా ఆహాజుకు ఇంకా ఇలా చెప్పాడు.

11 "నీ దేవుడైన యెహోవాను సూచన అడుగు. అది ఎంత లోతైనదైనా, ఎంత ఎత్తయినదైనా సరే."

12 కానీ ఆహాజు "నేను అడగను. యెహోవాను పరీక్షించను" అన్నాడు.

13 కాబట్టి యెషయా ఇలా జవాబిచ్చాడు. "దావీదు వంశస్థులారా, వినండి. మనుషులను విసికించడం చాలదన్నట్టు నా దేవుణ్ణి కూడా విసిగిస్తారా?

14 కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు. వినండి, కన్య గర్భం ధరించి కుమారుణ్ణి కని అతనికి ‘ఇమ్మానుయేలు’ అని పేరు పెడుతుంది.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    10 యెహోవా ఆహాజుతో మరలా మాట్లాడుతూ, 11 "నీ దేవుడైన యెహోవాను ఒక సూచన అడుగు. అది పాతాళమంత లోతైనా సరే, ఆకాశమంత ఎత్తైనా సరే" అన్నారు.

    12 అయితే ఆహాజు, "నేను అడగను, యెహోవాను పరీక్షించను" అన్నాడు.

    13 అప్పుడు యెషయా, "దావీదు కుటుంబమా! వినండి. మనుష్యుల ఓపికను పరీక్షించడం సరిపోదని, నా దేవుని ఓపికను కూడా పరీక్షిస్తున్నారా? 14 కాబట్టి, ప్రభువే స్వయంగా మీకు ఒక సూచన ఇస్తారు: ఇదిగో ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారుని కని, అతనికి ఇమ్మానుయేలు7:14 ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని పేరు పెడతారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.