10 యెహోవా ఆహాజుతో మరలా మాట్లాడుతూ, 11 "నీ దేవుడైన యెహోవాను ఒక సూచన అడుగు. అది పాతాళమంత లోతైనా సరే, ఆకాశమంత ఎత్తైనా సరే" అన్నారు.
12 అయితే ఆహాజు, "నేను అడగను, యెహోవాను పరీక్షించను" అన్నాడు.
13 అప్పుడు యెషయా, "దావీదు కుటుంబమా! వినండి. మనుష్యుల ఓపికను పరీక్షించడం సరిపోదని, నా దేవుని ఓపికను కూడా పరీక్షిస్తున్నారా? 14 కాబట్టి, ప్రభువే స్వయంగా మీకు ఒక సూచన ఇస్తారు: ఇదిగో ఒక కన్య గర్భం ధరించి ఒక కుమారుని కని, అతనికి ఇమ్మానుయేలు7:14 ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని పేరు పెడతారు.