దీవుని ఆత్మ ప్రోక్షణకు సంబంధించిన వాగ్దానం
28 తరువాత నేను ప్రజలందరి మీద
నా ఆత్మను కుమ్మరిస్తాను.
మీ కొడుకులూ మీ కూతుర్లూ ప్రవచనాలు చెబుతారు.
మీ ముసలివారు కలలుకంటారు.
మీ యువకులకు దర్శనాలు వస్తాయి.
29 ఆ రోజుల్లో నేను పనివారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను.
30 ఆకాశంలో అద్భుతాలు చూపిస్తాను.
భూమ్మీద రక్తం, మంటలు, ఎత్తయిన పొగ కలిగిస్తాను.
31 యెహోవా భయంకరమైన ఆ మహాదినం రాకముందు
సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంలా మారతాయి.
32 యెహోవా పేరున ప్రార్థనచేసే వారందరినీ కాపాడడం జరుగుతుంది.
యెహోవా చెప్పినట్టు సీయోను కొండమీద, యెరూషలేములో తప్పించుకున్నవారుంటారు.
యెహోవా ఏర్పాటు చేసుకున్నవాళ్ళు మిగులుతారు."