యెహోవా దినం
28 "ఆ తర్వాత
నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను.
మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు,
మీ వృద్ధులు కలలు కంటారు,
మీ యువకులు దర్శనాలు చూస్తారు.
29 ఆ రోజుల్లో నా సేవకుల మీద, సేవకురాండ్ర మీద కూడా
నా ఆత్మను కుమ్మరిస్తాను.
30 నేను ఆకాశంలో అద్భుతాలను,
భూమి మీద
రక్తం, అగ్ని, గొప్ప పొగను చూపిస్తాను.
31 యెహోవా భయంకరమైన మహాదినం రాకముందు,
సూర్యుడు చీకటిగా,
చంద్రుడు రక్తంగా మారుతాడు.
32 యెహోవా పేరట మొరపెట్టిన
ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు;
యెహోవా చెప్పినట్టే, సీయోను పర్వతం మీద,
యెరూషలేములో విడుదల ఉంటుంది,
ఎవరినైతే యెహోవా పిలుచుకుంటారో,
వారు రక్షింపబడతారు.