29 మరుసటిరోజు యేసు యోహాను దగ్గరికి వచ్చాడు. ఆయనను చూసి యోహాను ఇలా అన్నాడు, "చూడండి, లోకపాపాన్ని తీసివేసే దేవుని గొర్రెపిల్ల!
యేసుక్రీస్తు బహిరంగ పరిచర్య
35 మరుసటి రోజు యోహాను తన శిష్యులు ఇద్దరితో నిలబడి ఉన్నాడు. 36 అప్పుడు యేసు అక్కడ నడిచి వెళ్తుంటే యోహాను ఆయన వైపు చూసి, "ఇదిగో, చూడండి, దేవుని గొర్రెపిల్ల" అన్నాడు.
37 అతడు చెప్పిన మాట విని ఆ యిద్దరు శిష్యులు యేసు వెనకే వెళ్ళారు.