12 అప్పటి నుంచి పిలాతు యేసును విడుదల చెయ్యాలని ప్రయత్నం చేశాడు గాని యూదులు కేకలు పెడుతూ, "నువ్వు ఇతన్ని విడుదల చేస్తే, సీజరుకు మిత్రుడివి కాదు. తనను తాను రాజుగా చేసుకున్నవాడు సీజరుకు విరోధంగా మాట్లాడినట్టే" అన్నారు. 13 పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసుకొచ్చి, ‘రాళ్ళు పరచిన స్థలం’ లో న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి ‘గబ్బతా’ అని పేరు.
రాజును ప్రజలు, యూదుల పెద్దలు చివరిగా తిరస్కరించడం
14 అది పస్కా సిద్ధపాటు రోజు. ఉదయం ఇంచుమించు ఆరు గంటల సమయం. అప్పుడు పిలాతు యూదులతో, "ఇదిగో మీ రాజు!" అన్నాడు. 15 వారు కేకలు పెడుతూ, "చంపండి, చంపండి, సిలువ వేయండి!" అని అరిచారు. పిలాతు వారితో, "మీ రాజును సిలువ వేయమంటారా?" అన్నాడు. ముఖ్య యాజకులు "మాకు సీజరు తప్ప వేరే రాజు లేడు" అన్నారు.
యేసుక్రీస్తు సిలువ
మత్తయి 27:33-54; మార్కు 15:22-39; లూకా 23:33-47
16 అప్పుడు పిలాతు, సిలువ వేయడానికి యేసును వారికి అప్పగించాడు. వారు యేసును తీసుకువెళ్ళారు.