Pular para o conteúdo
Publicidade

యోహాను సువార్త 19:12-16

OTSA Telugu Contemporary Version

12 అప్పటినుండి పిలాతు యేసును విడుదల చేయడానికి ప్రయత్నించాడు కాని యూదా నాయకులు, "నీవు ఇతన్ని విడుదల చేస్తే నీవు కైసరుకు స్నేహితుడవు కావు. నేను రాజును అని చెప్పుకునే ప్రతివాడు కైసరుకు విరోధి" అని కేకలు వేశారు.

13 పిలాతు ఈ మాటలను విని, యేసును బయటకు తీసుకువచ్చి, రాతి బాటగా ప్రసిద్ధి చెందిన స్థలంలో అతడు న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి గబ్బతా అని పేరు. 14 అది పస్కాను సిద్ధపరచే రోజు, అప్పుడు ఇంచుమించు ఉదయం ఆరు గంటల సమయం అవుతుంది.

పిలాతు, "ఇదిగో మీ రాజు" అని యూదులతో చెప్పాడు.

15 కాని వారు, "అతన్ని తీసుకెళ్లండి! అతన్ని తీసుకెళ్లండి! సిలువ వేయండి!" అని కేకలు వేశారు.

"మీ రాజును నేను సిలువ వేయనా?" అని పిలాతు అడిగాడు.

అప్పుడు ముఖ్య యాజకులు, "మాకు కైసరు తప్ప వేరే రాజు లేడు" అన్నారు.

16 చివరికి పిలాతు సిలువ వేయడానికి యేసును వారికి అప్పగించాడు.

యేసు సిలువ వేయబడుట

కాబట్టి సైనికులు యేసును తీసుకెళ్లారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    12 అప్పటి నుంచి పిలాతు యేసును విడుదల చెయ్యాలని ప్రయత్నం చేశాడు గాని యూదులు కేకలు పెడుతూ, "నువ్వు ఇతన్ని విడుదల చేస్తే, సీజరుకు మిత్రుడివి కాదు. తనను తాను రాజుగా చేసుకున్నవాడు సీజరుకు విరోధంగా మాట్లాడినట్టే" అన్నారు. 13 పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసుకొచ్చి, ‘రాళ్ళు పరచిన స్థలం’ లో న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి ‘గబ్బతా’ అని పేరు.

    14 అది పస్కా సిద్ధపాటు రోజు. ఉదయం ఇంచుమించు ఆరు గంటల సమయం. అప్పుడు పిలాతు యూదులతో, "ఇదిగో మీ రాజు!" అన్నాడు. 15 వారు కేకలు పెడుతూ, "చంపండి, చంపండి, సిలువ వేయండి!" అని అరిచారు. పిలాతు వారితో, "మీ రాజును సిలువ వేయమంటారా?" అన్నాడు. ముఖ్య యాజకులు "మాకు సీజరు తప్ప వేరే రాజు లేడు" అన్నారు.

    16 అప్పుడు పిలాతు, సిలువ వేయడానికి యేసును వారికి అప్పగించాడు. వారు యేసును తీసుకువెళ్ళారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.