9 ఒడ్డుకి రాగానే వారికి అక్కడ నిప్పులూ, వాటి పైన ఉన్న చేపలూ రొట్టే కనిపించాయి.
సేవకు ఉండవలసిన ఒకే ఒక ఆమోదయోగ్యమైన ప్రేరణ
15 వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, "యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?" అని ప్రశ్నించాడు. అతడు, "అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు" అన్నాడు. దానికి యేసు, "నా గొర్రెలను మేపు" అని అతనితో చెప్పాడు.
16 మరోసారి ఆయన, "యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అతణ్ణి అడిగాడు. అతడు, "అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు" అన్నాడు. దానికి యేసు, "నా గొర్రెలకు కాపరిగా ఉండు" అన్నాడు.
17 ఆయన మూడోసారి, "యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి, "ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు" అన్నాడు.
తన సేవకుని మరణ సమయాన్ని, విధానాన్ని యజమాని నిర్ణయించడం
అప్పుడు యేసు, "నా గొర్రెలను మేపు. 18 నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే నీ నడుం కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు తిరిగే వాడివి. కచ్చితంగా నీకు చెబుతున్నాను. నువ్వు ముసలి వాడివి అయినప్పుడు నువ్వు నీ చేతులు చాపుతావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం లేని చోటికి నిన్ను మోసుకు పోతాడు" అని అతనితో చెప్పాడు. 19 దేవుని మహిమ కోసం అతడు ఎలాంటి మరణం పొందుతాడో దాన్ని సూచిస్తూ ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇలా చెప్పి ఆయన, "నన్ను అనుసరించు" అని అతనితో అన్నాడు.