Pular para o conteúdo
Publicidade

యోహాను సువార్త 21:9,15-19

OTSA Telugu Contemporary Version

9 వారు ఒడ్డుకు రాగానే, అక్కడ నిప్పులో కాలుతుండిన చేపలను కొన్ని రొట్టెలను చూశారు.

యేసు పేతురుతో సంభాషణ

15 వారు తిని ముగించిన తర్వాత యేసు సీమోను పేతురుతో, "యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?" అని అడిగారు.

అతడు, "అవును, ప్రభువా! నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు" అన్నాడు.

అయితే, "నా గొర్రెపిల్లలను మేపుము" అని యేసు చెప్పారు.

16 మరల యేసు, "యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా?" అని రెండవసారి అడిగారు.

అతడు, "అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు" అని చెప్పాడు.

అందుకు యేసు, "నా గొర్రెలను కాయుము" అన్నారు.

17 యేసు మూడవసారి అతనితో, "యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడిగారు.

యేసు తనను మూడవసారి, "నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడిగినందుకు బాధపడిన పేతురు, "ప్రభువా, నీవు అన్ని తెలిసినవాడవు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు" అని చెప్పాడు.

అందుకు యేసు, "నా గొర్రెలను మేపుము" 18 నేను మీతో చెప్పేది నిజం, "నీవు యవ్వనస్థునిగా ఉన్నప్పుడు, నీకు నీవే నీ నడుము కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు వెళ్లేవాడివి. కాని నీవు ముసలి వాడవైనప్పుడు నీవు నీ చేతులను చాపుతావు, అప్పుడు మరొకడు నీ నడుమును కట్టి నీకు ఇష్టం లేని చోటికి నిన్ను మోసుకువెళ్తాడు" అని చెప్పారు. 19 పేతురు ఎలాంటి మరణం పొంది దేవుని మహిమపరుస్తాడో సూచిస్తూ యేసు ఈ విషయాలను చెప్పారు. ఇలా చెప్పి ఆయన అతనితో, "నన్ను వెంబడించు" అని చెప్పారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    9 ఒడ్డుకి రాగానే వారికి అక్కడ నిప్పులూ, వాటి పైన ఉన్న చేపలూ రొట్టే కనిపించాయి.

    15 వారంతా భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూసి, "యోహాను కొడుకువైన సీమోనూ, వీళ్ళకంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?" అని ప్రశ్నించాడు. అతడు, "అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు" అన్నాడు. దానికి యేసు, "నా గొర్రెలను మేపు" అని అతనితో చెప్పాడు.

    16 మరోసారి ఆయన, "యోహాను కొడుకువైన సీమోనూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అతణ్ణి అడిగాడు. అతడు, "అవును ప్రభూ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు" అన్నాడు. దానికి యేసు, "నా గొర్రెలకు కాపరిగా ఉండు" అన్నాడు.

    17 ఆయన మూడోసారి, "యోహాను కొడుకువైన సీమోనూ, నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడిగాడు. ఇలా ‘నన్ను ప్రేమిస్తున్నావా’ అని మూడోసారి తనను అడిగినందుకు పేతురు ఇబ్బంది పడి, "ప్రభూ నీకు అన్నీ తెలుసు. నిన్ను ప్రేమిస్తున్నానని నీకు బాగా తెలుసు" అన్నాడు.

    అప్పుడు యేసు, "నా గొర్రెలను మేపు. 18 నువ్వు యువకుడిగా ఉన్నప్పుడు నీ అంతట నువ్వే నీ నడుం కట్టుకుని నీకిష్టమైన స్థలాలకు తిరిగే వాడివి. కచ్చితంగా నీకు చెబుతున్నాను. నువ్వు ముసలి వాడివి అయినప్పుడు నువ్వు నీ చేతులు చాపుతావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టం లేని చోటికి నిన్ను మోసుకు పోతాడు" అని అతనితో చెప్పాడు. 19 దేవుని మహిమ కోసం అతడు ఎలాంటి మరణం పొందుతాడో దాన్ని సూచిస్తూ ఆయన ఈ మాటలు చెప్పాడు. ఇలా చెప్పి ఆయన, "నన్ను అనుసరించు" అని అతనితో అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.