2 నువ్వు వెళ్లి కుమ్మరి చేసిన మట్టికుండ కొను. ప్రజల పెద్దల్లో కొంతమందినీ యాజకుల్లో పెద్దవారినీ వెంటబెట్టుకుని హర్సీతు ద్వారానికి ఎదురుగా ఉన్న బెన్ హిన్నోము లోయలోకి వెళ్ళి, నేను నీతో చెప్పే ఈ మాటలు అక్కడ ప్రకటించు.
3 "యూదా రాజులారా! యెరూషలేము నివాసులారా! యెహోవా మాట వినండి. సేనల అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవుడు చెప్పేది వినండి. నేను ఈ స్థలం మీదికి విపత్తు రప్పిస్తున్నాను. దాని గురించి వినేవారందరి చెవులు గింగురుమనేటంత భయంకరంగా ఉంటుంది.
4 ఎందుకంటే వాళ్ళు నన్ను విడిచిపెట్టి ఈ స్థలాన్ని పాడు చేశారు. వాళ్ళకు తెలియని ఇతర దేవుళ్ళ ఎదుట ధూపం వేశారు. వాళ్ళూ వాళ్ళ పూర్వీకులూ యూదా రాజులు కూడా నిరపరాధుల రక్తంతో ఈ స్థలాన్ని నింపారు.
5 వాళ్ళు తమ కొడుకులను దహనబలులుగా కాల్చడానికి బయలుకు బలిపీఠాలు కట్టించారు. అలా చేయమని నేను వాళ్లకు చెప్పలేదు, అది నా మనస్సుకు ఎన్నడూ తోచలేదు."
6 కాబట్టి యెహోవా చెప్పేదేమిటంటే "రాబోయే రోజుల్లో ఈ స్థలాన్ని ‘వధ లోయ’ అంటారు. తోఫెతు అని గానీ బెన్ హిన్నోము లోయ అని గానీ అనరు.