2 హర్సీతు19:2 లేదా కుండపెంకు ద్వారం దగ్గర ఉన్న బెన్ హిన్నోము లోయకు వెళ్లి అక్కడ నేను మీకు చెప్పే మాటలు ప్రకటిస్తూ, 3 ఇలా చెప్పు, ‘యూదా రాజులారా, యెరూషలేము ప్రజలారా, యెహోవా మాట వినండి. ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: వినండి! నేను ఈ స్థలం మీదికి ఒక విపత్తును తెచ్చి, దాని గురించి వినేవారందరి చెవులు గింగురుమనేలా చేస్తాను. 4 ఎందుకంటే వారు నన్ను విడిచిపెట్టి, ఈ స్థలాన్ని ఇతర దేవతల స్థలంగా చేశారు. వారికి గాని, వారి పూర్వికులకు గాని, యూదా రాజులకు గాని తెలియని దేవతలకు ధూపం వేసి, ఈ స్థలాన్ని నిర్దోషుల రక్తంతో నింపారు. 5 వారు తమ పిల్లలను బయలుకు దహనబలులుగా అగ్నిలో కాల్చడానికి బయలుకు క్షేత్రాలను నిర్మించారు. అలా చేయమని నేను వారికి ఆజ్ఞాపించలేదు, కనీసం ప్రస్తావించలేదు, అసలు అది నా మనస్సులోకి కూడా రాలేదు. 6 ప్రజలు ఇకపై ఈ ప్రదేశాన్ని తోఫెతు లేదా బెన్ హిన్నోము లోయ అని పిలువకుండా, వధ లోయ అని పిలిచే రోజులు రాబోతున్నాయి, కాబట్టి జాగ్రత్త వహించండి, అని యెహోవా హెచ్చరించారు.
యిర్మీయా 19:2-6
Em outras traduções
- IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
2 నువ్వు వెళ్లి కుమ్మరి చేసిన మట్టికుండ కొను. ప్రజల పెద్దల్లో కొంతమందినీ యాజకుల్లో పెద్దవారినీ వెంటబెట్టుకుని హర్సీతు ద్వారానికి ఎదురుగా ఉన్న బెన్ హిన్నోము లోయలోకి వెళ్ళి, నేను నీతో చెప్పే ఈ మాటలు అక్కడ ప్రకటించు.
3 "యూదా రాజులారా! యెరూషలేము నివాసులారా! యెహోవా మాట వినండి. సేనల అధిపతి యెహోవా, ఇశ్రాయేలు దేవుడు చెప్పేది వినండి. నేను ఈ స్థలం మీదికి విపత్తు రప్పిస్తున్నాను. దాని గురించి వినేవారందరి చెవులు గింగురుమనేటంత భయంకరంగా ఉంటుంది.
4 ఎందుకంటే వాళ్ళు నన్ను విడిచిపెట్టి ఈ స్థలాన్ని పాడు చేశారు. వాళ్ళకు తెలియని ఇతర దేవుళ్ళ ఎదుట ధూపం వేశారు. వాళ్ళూ వాళ్ళ పూర్వీకులూ యూదా రాజులు కూడా నిరపరాధుల రక్తంతో ఈ స్థలాన్ని నింపారు.
5 వాళ్ళు తమ కొడుకులను దహనబలులుగా కాల్చడానికి బయలుకు బలిపీఠాలు కట్టించారు. అలా చేయమని నేను వాళ్లకు చెప్పలేదు, అది నా మనస్సుకు ఎన్నడూ తోచలేదు."
6 కాబట్టి యెహోవా చెప్పేదేమిటంటే "రాబోయే రోజుల్లో ఈ స్థలాన్ని ‘వధ లోయ’ అంటారు. తోఫెతు అని గానీ బెన్ హిన్నోము లోయ అని గానీ అనరు.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.