16 సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. "మీకు ప్రవచనాలు ప్రకటించే ప్రవక్తల మాటలు వినవద్దు. వాళ్ళు మిమ్మల్ని భ్రమపెట్టారు! వాళ్ళు యెహోవా నోటి నుంచి వచ్చినవి కాక తమ సొంత మనస్సులోని దర్శనాలను ప్రకటిస్తున్నారు."
17 "మీకు శాంతిక్షేమాలు కలుగుతాయని యెహోవా చెబుతున్నాడు" అని నన్ను తృణీకరించే వాళ్ళతో అదే పనిగా చెబుతున్నారు. "మీ మీదికి ఏ కీడూ రాదు" అని తన హృదయ మూర్ఖత ప్రకారం నడుచుకునే ప్రతివారూ చెబుతున్నారు.
21 "నేను ఈ ప్రవక్తలను పంపలేదు. అయినా వాళ్ళు వచ్చారు. నేను వాళ్ళతో మాట్లాడలేదు. అయినా వాళ్ళు ప్రవచించారు.