Pular para o conteúdo
Publicidade

యిర్మీయా 23:16,17,21

OTSA Telugu Contemporary Version

16 సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు:

"ప్రవక్తలు మీకు చెప్పే ప్రవచనాలను వినవద్దు;

అవి మిమ్మల్ని భ్రమ పెడతాయి.

వారి సొంత మనస్సులోని దర్శనాలు చెప్తారు,

కాని యెహోవా నోటి నుండి వచ్చినవి కాదు.

17 ‘మీకు సమాధానం కలుగుతుంది యెహోవా చెప్తున్నారు’

అని నన్ను తృణీకరించే వారితో అంటారు.

‘మీకు హాని జరగదు’

అని వారు హృదయ కాఠిన్యం గలవారితో అంటారు.

21 నేను ఈ ప్రవక్తలను పంపలేదు,

అయినాసరే వారు తమ సొంత సందేశంతో పరుగెత్తుకు వచ్చారు;

నేను వారితో మాట్లాడలేదు,

అయినాసరే వారు ప్రవచించారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    16 సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. "మీకు ప్రవచనాలు ప్రకటించే ప్రవక్తల మాటలు వినవద్దు. వాళ్ళు మిమ్మల్ని భ్రమపెట్టారు! వాళ్ళు యెహోవా నోటి నుంచి వచ్చినవి కాక తమ సొంత మనస్సులోని దర్శనాలను ప్రకటిస్తున్నారు."

    17 "మీకు శాంతిక్షేమాలు కలుగుతాయని యెహోవా చెబుతున్నాడు" అని నన్ను తృణీకరించే వాళ్ళతో అదే పనిగా చెబుతున్నారు. "మీ మీదికి ఏ కీడూ రాదు" అని తన హృదయ మూర్ఖత ప్రకారం నడుచుకునే ప్రతివారూ చెబుతున్నారు.

    21 "నేను ఈ ప్రవక్తలను పంపలేదు. అయినా వాళ్ళు వచ్చారు. నేను వాళ్ళతో మాట్లాడలేదు. అయినా వాళ్ళు ప్రవచించారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.