4 అందులో ఇలా ఉంది "ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా తన ఉద్దేశం చొప్పున బబులోనుకు బందీలుగా వెళ్ళిన వాళ్ళందరికీ ఇలా చెబుతున్నాడు, 5 ‘ఇళ్ళు కట్టుకుని వాటిలో నివాసం ఉండండి. తోటలు నాటి వాటి ఫలాలు అనుభవించండి.
6 పెళ్ళిళ్ళు చేసుకుని కొడుకులనూ కూతుళ్ళనూ కనండి. అక్కడ మీరు తక్కువ సంఖ్యలో ఉండకుండా అభివృద్ధి పొందడానికి మీ కొడుకులకూ, కూతుళ్ళకూ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళను కొడుకులూ కూతుళ్ళూ కననివ్వండి. 7 నేను మిమ్మల్ని బందీలుగా తీసుకెళ్ళిన పట్టణం క్షేమం కోరి దాని కోసం యెహోవాకు ప్రార్థన చేయండి. ఎందుకంటే, దానికి క్షేమం కలిగితే మీకు క్షేమం కలుగుతుంది.’