4 ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా తన ఇష్టప్రకారం యెరూషలేము నుండి బబులోనుకు బందీలుగా తీసుకువెళ్లిన వారందరితో ఇలా అంటున్నారు: 5 "ఇల్లు కట్టుకుని స్థిరపడండి; తోటలు నాటి వాటి పండ్లను తినండి. 6 పెళ్ళి చేసుకుని కుమారులు, కుమార్తెలను కనండి; మీ కుమారులకు భార్యలను తెచ్చుకోండి, మీ కుమార్తెలకు పెళ్ళి చేయండి, వారు కూడా కుమారులు కుమార్తెలను కంటారు. అప్పుడు మీ సంఖ్య తగ్గకుండ అధికమవుతుంది. 7 అలాగే, నేను మిమ్మల్ని బందీలుగా తీసుకువెళ్లిన పట్టణంలో సమాధానం, అభివృద్ధి ఉండాలని కోరుకుని యెహోవాను ప్రార్థించండి, ఎందుకంటే అది అభివృద్ధి చెందితే, మీరు కూడా అభివృద్ధి చెందుతారు."
Publicidade
యిర్మీయా 29:4-7
OTSA Telugu Contemporary Version
Em outras traduções
- IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
4 అందులో ఇలా ఉంది "ఇశ్రాయేలు దేవుడూ, సేనల ప్రభువూ అయిన యెహోవా తన ఉద్దేశం చొప్పున బబులోనుకు బందీలుగా వెళ్ళిన వాళ్ళందరికీ ఇలా చెబుతున్నాడు, 5 ‘ఇళ్ళు కట్టుకుని వాటిలో నివాసం ఉండండి. తోటలు నాటి వాటి ఫలాలు అనుభవించండి.
6 పెళ్ళిళ్ళు చేసుకుని కొడుకులనూ కూతుళ్ళనూ కనండి. అక్కడ మీరు తక్కువ సంఖ్యలో ఉండకుండా అభివృద్ధి పొందడానికి మీ కొడుకులకూ, కూతుళ్ళకూ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళను కొడుకులూ కూతుళ్ళూ కననివ్వండి. 7 నేను మిమ్మల్ని బందీలుగా తీసుకెళ్ళిన పట్టణం క్షేమం కోరి దాని కోసం యెహోవాకు ప్రార్థన చేయండి. ఎందుకంటే, దానికి క్షేమం కలిగితే మీకు క్షేమం కలుగుతుంది.’
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.