12 యెహోవా ఇశ్రాయేలీయులకు అమోరీయులను అప్పగించిన ఆ రోజున, ఇశ్రాయేలీయులు వింటుండగా యెహోషువ యెహోవాకు ఈ విధంగా ప్రార్థన చేశాడు,
"సూర్యుడా, నీవు గిబియోనులో నిలిచిపో.
చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలిచిపో."
13 "ప్రజలు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనే వరకూ సూర్యుడు నిలిచిపోయాడు,
చంద్రుడు ఆగిపోయాడు" అనే మాట యాషారు గ్రంథంలో రాసి ఉంది కదా.
సూర్యుడు ఆకాశం మధ్యలో నిలిచిపోయి
ఇంచుమించు ఒక రోజంతా అస్తమించ లేదు.
14 యెహోవా ఒక నరుని మనవి విన్న ఆ రోజులాంటి మరొక రోజు, దాని ముందు గానీ దాని తరువాత గానీ లేదు, ఆ రోజు యెహోవా, ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేశాడు.