Pular para o conteúdo
Publicidade

యెహోషువ 10:12-14

OTSA Telugu Contemporary Version

12 యెహోవా అమోరీయులను ఇశ్రాయేలీయులకు అప్పగించిన రోజున, యెహోషువ ఇశ్రాయేలీయుల సమక్షంలో యెహోవాతో ఇలా అన్నాడు:

"సూర్యుడా, గిబియోనుపై నిలిచిపో,

చంద్రుడా, అయ్యాలోను లోయ పైగా ఆగిపో."

13 ప్రజలు తమ శత్రువులపై పూర్తి విజయం సాధించే వరకు,

సూర్యుడు నిలిచిపోయాడు,

చంద్రుడు ఆగిపోయాడు,

అని యాషారు10:13 యాషారు అంటే వీరులు లేదా శూరులు వ్రాసిన వీరుల గ్రంథంలో వ్రాయబడినట్లుగా జరిగింది.

సూర్యుడు ఆకాశం మధ్యలో ఆగి, దాదాపు ఒక రోజు ఆలస్యమయ్యాడు. 14 యెహోవా ఒక మానవుడి మాట విన్న ఆ రోజులాంటిది ఇంకొకటి అంతకుముందుగానీ ఆ తర్వాత గాని లేదు. నిజంగా యెహోవా ఇశ్రాయేలీయుల కోసం యుద్ధం చేశారు!

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    12 యెహోవా ఇశ్రాయేలీయులకు అమోరీయులను అప్పగించిన ఆ రోజున, ఇశ్రాయేలీయులు వింటుండగా యెహోషువ యెహోవాకు ఈ విధంగా ప్రార్థన చేశాడు,

    "సూర్యుడా, నీవు గిబియోనులో నిలిచిపో.

    చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలిచిపో."

    13 "ప్రజలు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనే వరకూ సూర్యుడు నిలిచిపోయాడు,

    చంద్రుడు ఆగిపోయాడు" అనే మాట యాషారు గ్రంథంలో రాసి ఉంది కదా.

    సూర్యుడు ఆకాశం మధ్యలో నిలిచిపోయి

    ఇంచుమించు ఒక రోజంతా అస్తమించ లేదు.

    14 యెహోవా ఒక నరుని మనవి విన్న ఆ రోజులాంటి మరొక రోజు, దాని ముందు గానీ దాని తరువాత గానీ లేదు, ఆ రోజు యెహోవా, ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేశాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.