Pular para o conteúdo
Publicidade

న్యాయాధిపతులు 6:11,12,22-24

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

11 అప్పుడు యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకి చెట్టు కింద కూర్చున్నాడు. యోవాషు కొడుకు గిద్యోను మిద్యానీయుల కంటబడకుండా గానుగ చాటున గోదుమలు దుళ్లగొడుతూ ఉన్నప్పుడు, 12 యెహోవా దూత అతనికి కనబడి "శౌర్యం గల బలశాలీ, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు" అని అతనితో అన్నాడు,

22 గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకుని "అహా, నా ప్రభూ, యెహోవా, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూశాను" అన్నాడు. 23 అప్పుడు యెహోవా "నీకు సమాధానం ఉండు గాక. భయపడకు! నువ్వు చనిపోవు" అని అతనితో చెప్పాడు.

24 అక్కడ గిద్యోను యెహోవా పేరట బలిపీఠం కట్టి, దానికి "యెహోవా సమాధానకర్త" అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ అది అబీయెజ్రీయుల ప్రాంతమైన ఒఫ్రాలో ఉన్నది.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    11 యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకిచెట్టు క్రింద కూర్చున్నాడు. అక్కడ యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు కనపడకుండా ద్రాక్షగానుగ చాటున గోధుమలను దుళ్లగొడుతున్నాడు. 12 యెహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమై, "పరాక్రమంగల యోధుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నారు" అన్నాడు.

    22 వెంటనే అతడు యెహోవా దూత అని గిద్యోను గ్రహించినప్పుడు, "అయ్యో, ప్రభువైన యెహోవా! నేను యెహోవా దూతను ముఖాముఖిగా చూశాను!" అని ఆశ్చర్యపోయాడు.

    23 అయితే యెహోవా అతనితో, "నీకు సమాధానం, భయపడకు. నీవు చావవు" అన్నారు.

    24 కాబట్టి గిద్యోను అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి దానికి యెహావా సమాధానకర్త6:24 అంటే, యెహోవా షాలోం అని పేరు పెట్టాడు. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.