11 యెహోవా దూత వచ్చి ఒఫ్రాలో అబీయెజ్రీయుడైన యోవాషుకు చెందిన మస్తకిచెట్టు క్రింద కూర్చున్నాడు. అక్కడ యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు కనపడకుండా ద్రాక్షగానుగ చాటున గోధుమలను దుళ్లగొడుతున్నాడు. 12 యెహోవా దూత గిద్యోనుకు ప్రత్యక్షమై, "పరాక్రమంగల యోధుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నారు" అన్నాడు.
22 వెంటనే అతడు యెహోవా దూత అని గిద్యోను గ్రహించినప్పుడు, "అయ్యో, ప్రభువైన యెహోవా! నేను యెహోవా దూతను ముఖాముఖిగా చూశాను!" అని ఆశ్చర్యపోయాడు.
23 అయితే యెహోవా అతనితో, "నీకు సమాధానం, భయపడకు. నీవు చావవు" అన్నారు.
24 కాబట్టి గిద్యోను అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి దానికి యెహావా సమాధానకర్త6:24 అంటే, యెహోవా షాలోం అని పేరు పెట్టాడు. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది.