Pular para o conteúdo
Publicidade

లూకా రాసిన సువార్త 24:39-43

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

39 నేనే ఆయనను అనడానికి రుజువుగా నా చేతులూ, నా పాదాలూ చూడండి. నన్ను ముట్టుకుని చూడండి. నాకు ఉన్నట్టుగా ఆత్మకు ఎముకలూ మాంసమూ ఉండవు" అని చెప్పాడు. 40 అలా చెప్పి తన చేతులనూ, కాళ్ళనూ వారికి చూపించాడు.

41 అయితే వారు సంతోషంతో తబ్బిబ్బులై పోతూ ఇంకా నమ్మకుండా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన, "మీ దగ్గర ఏదైనా ఆహారం ఉందా?" అని అడిగాడు. 42 వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు. 43 ఆయన దాన్ని తీసుకుని వారి కళ్ళ ముందే తిన్నాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    39 నా చేతులను నా పాదాలను చూడండి, ‘ఇది నేనే!’ నన్ను ముట్టుకొని చూడండి; నాకు ఉన్నట్లు, ఒక భూతానికి ఎముకలు మాంసం ఉండవు" అని చెప్పారు.

    40 ఆయన ఇలా చెప్పి, తన చేతులను, తన పాదాలను వారికి చూపించారు. 41 అయితే వారు సంతోషాన్ని బట్టి ఆశ్చర్యాన్ని బట్టి ఇంకా నమ్మలేకుండా ఉన్నప్పుడు, ఆయన వారిని, "ఇక్కడ మీ దగ్గర ఏమైన తినడానికి ఉందా?" అని అడిగారు. 42 వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు. 43 ఆయన దానిని తీసుకుని వారి ముందే తిన్నారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.