39 నా చేతులను నా పాదాలను చూడండి, ‘ఇది నేనే!’ నన్ను ముట్టుకొని చూడండి; నాకు ఉన్నట్లు, ఒక భూతానికి ఎముకలు మాంసం ఉండవు" అని చెప్పారు.
40 ఆయన ఇలా చెప్పి, తన చేతులను, తన పాదాలను వారికి చూపించారు. 41 అయితే వారు సంతోషాన్ని బట్టి ఆశ్చర్యాన్ని బట్టి ఇంకా నమ్మలేకుండా ఉన్నప్పుడు, ఆయన వారిని, "ఇక్కడ మీ దగ్గర ఏమైన తినడానికి ఉందా?" అని అడిగారు. 42 వారు కాల్చిన చేప ముక్కను ఆయనకు ఇచ్చారు. 43 ఆయన దానిని తీసుకుని వారి ముందే తిన్నారు.