Pular para o conteúdo
Publicidade

లూకా రాసిన సువార్త 6:12-16

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

12 ఆ రోజుల్లో ఆయన ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళి దేవునికి ప్రార్థన చేయడంలో రాత్రంతా గడిపాడు.

పన్నెండుమంది ఎంపిక

మత్తయి 10:2-4; మార్కు 3:13-19

13 ఉదయాన్నే ఆయన తన శిష్యులను పిలిచాడు. వారిలో పన్నెండు మందిని ఏర్పాటు చేసి వారికి అపొస్తలులు అని పేరు పెట్టాడు. 14 వారు ఎవరంటే ఆయన పేతురు అని పిలిచిన సీమోను, అతని సోదరుడు అంద్రెయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, 15 మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, దేశభక్తుడు అని పిలిచే సీమోను, 16 యాకోబు సోదరుడు యూదా, నమ్మక ద్రోహి ఇస్కరియోతు యూదా అనే వారు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    12 ఆ రోజుల్లో ఒక రోజు ప్రార్థించడానికి యేసు కొండెక్కి రాత్రంతా దేవుని ప్రార్థిస్తూ గడిపారు. 13 ఉదయమైనప్పుడు, ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండుమందిని ఎన్నుకుని, వారిని అపొస్తలులుగా నియమించారు. అపొస్తలులు అనగా "పిలువబడిన వారు" అని అర్థము:

    14 వారు ఎవరనగా, ఆయన పేతురు అని పేరుపెట్టిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ,

    యాకోబు,

    యోహాను,

    ఫిలిప్పు,

    బర్తలోమయి,

    15 మత్తయి,

    తోమా,

    అల్ఫయి కుమారుడైన యాకోబు,

    జెలోతే6:15 అంటే మతాభిమాని లేదా అత్యాసక్తి కలవాడు అని పిలువబడే సీమోను,

    16 యాకోబు కుమారుడైన యూదా,

    ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.