పన్నెండుమంది అపొస్తలులు
12 ఆ రోజుల్లో ఒక రోజు ప్రార్థించడానికి యేసు కొండెక్కి రాత్రంతా దేవుని ప్రార్థిస్తూ గడిపారు. 13 ఉదయమైనప్పుడు, ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండుమందిని ఎన్నుకుని, వారిని అపొస్తలులుగా నియమించారు. అపొస్తలులు అనగా "పిలువబడిన వారు" అని అర్థము:
14 వారు ఎవరనగా, ఆయన పేతురు అని పేరుపెట్టిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ,
యాకోబు,
యోహాను,
ఫిలిప్పు,
బర్తలోమయి,
15 మత్తయి,
తోమా,
అల్ఫయి కుమారుడైన యాకోబు,
జెలోతే6:15 అంటే మతాభిమాని లేదా అత్యాసక్తి కలవాడు అని పిలువబడే సీమోను,
16 యాకోబు కుమారుడైన యూదా,
ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా.