Pular para o conteúdo
Publicidade

మార్కు రాసిన సువార్త 11:12-14,20,21

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

వాడిపోయిన అంజూరు చెట్టు

12 మరుసటి రోజు బేతనీ నుండి వస్తుండగా ఆయనకు ఆకలి వేసింది. 13 కొంత దూరంలో ఆకులున్న అంజూరు చెట్టు ఆయనకు కనిపించింది. ఆ చెట్టుకు పండ్లు ఉన్నాయేమో అని చూడడానికి దగ్గరికి వెళ్ళాడు. కాని, అది పండ్లు కాసే కాలం కానందువల్ల ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. 14 ఆయన ఆ చెట్టుతో, "ఇక నుండి ఎన్నడూ ఎవ్వరూ నీ పండ్లు తినరు" అన్నాడు. ఆయన పలికినది శిష్యులు విన్నారు.

మత్తయి 21:12-16; లూకా 19:45-47; యోహా 2:13-16

20 తరువాతి రోజు ఉదయం వారు ఆ దారిన నడుస్తూ ఉంటే అంజూరు చెట్టు వేరులతో సహా ఎండిపోయి ఉండడం గమనించారు. 21 అప్పుడు పేతురుకు యేసు మాటలు జ్ఞాపకం వచ్చి ఆయనతో, "రబ్బీ! నీవు శపించిన అంజూరు చెట్టు ఎండిపోయింది" అన్నాడు.

యాకో 5:15

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    12 మరుసటిరోజు వారు బేతనియ గ్రామాన్ని విడిచి వెళ్లేటప్పుడు, యేసుకు ఆకలివేసింది. 13 దూరం నుండి ఒక అంజూర చెట్టును చూసి, దానిలో ఏమైనా పండ్లు ఉన్నాయా అని దగ్గరకు వెళ్లారు. కాని అది అంజూర పండ్లు కాసే కాలం కాదు కాబట్టి ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. 14 అప్పుడు యేసు ఆ చెట్టుతో, "ఇకపై ఎవ్వరూ ఎన్నడు నీ పండ్లను తినకపోవుదురు గాక" అన్నారు. ఆయన అలా అనడం శిష్యులు విన్నారు.

    20 మరుసటి ఉదయం, వారు వెళ్తున్నప్పుడు, ఆ అంజూర చెట్టు వేర్లతో సహా ఎండిపోయిందని వారు గమనించారు. 21 అందుకు పేతురు దానిని జ్ఞాపకం చేసుకుని యేసుతో, "బోధకుడా చూడు! నీవు శపించిన అంజూర చెట్టు ఎండిపోయింది" అన్నాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.