యేసు అంజూర చెట్టును శపించుట దేవాలయ ఆవరణాన్ని శుభ్రపరచుట
12 మరుసటిరోజు వారు బేతనియ గ్రామాన్ని విడిచి వెళ్లేటప్పుడు, యేసుకు ఆకలివేసింది. 13 దూరం నుండి ఒక అంజూర చెట్టును చూసి, దానిలో ఏమైనా పండ్లు ఉన్నాయా అని దగ్గరకు వెళ్లారు. కాని అది అంజూర పండ్లు కాసే కాలం కాదు కాబట్టి ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. 14 అప్పుడు యేసు ఆ చెట్టుతో, "ఇకపై ఎవ్వరూ ఎన్నడు నీ పండ్లను తినకపోవుదురు గాక" అన్నారు. ఆయన అలా అనడం శిష్యులు విన్నారు.
20 మరుసటి ఉదయం, వారు వెళ్తున్నప్పుడు, ఆ అంజూర చెట్టు వేర్లతో సహా ఎండిపోయిందని వారు గమనించారు. 21 అందుకు పేతురు దానిని జ్ఞాపకం చేసుకుని యేసుతో, "బోధకుడా చూడు! నీవు శపించిన అంజూర చెట్టు ఎండిపోయింది" అన్నాడు.