యేసును బంధించడం
43 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మందిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలూ పంపిన పెద్ద గుంపు అతనితో ఉంది. వారి దగ్గర కత్తులూ దుడ్డు కర్రలూ ఉన్నాయి. 44 ఆయనను అప్పగించేవాడు ముందుగానే వారికి ఒక గుర్తు చెప్పి, "నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఆయనను బంధించి తీసుకు వెళ్ళండి" అన్నాడు. 45 అతడు అక్కడికి చేరిన వెంటనే యేసు దగ్గరికి వచ్చి, "రబ్బీ!" అంటూ ఆయనను ముద్దుపెట్టుకున్నాడు. 46 అప్పుడు వారు యేసు మీద పడి గట్టిగా పట్టుకున్నారు.
మత్తయి 26:51-56
50 అప్పుడు యేసు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు.