Pular para o conteúdo
Publicidade

మార్కు సువార్త 14:43-46,50

OTSA Telugu Contemporary Version

యేసు బంధించబడుట

43 ఆయన ఇంకా మాట్లాడుతుండగా, పన్నెండుగురిలో ఒకడైన, యూదా వచ్చాడు. అతనితో పాటు ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు నాయకులు పంపిన పెద్ద గుంపు కత్తులు కర్రలు పట్టుకుని వచ్చింది.

44 ఆయనను పట్టించేవాడు వారికి గుర్తులు చెప్పాడు: "నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో; ఆయనను మీరు బంధించి బందోబస్తుతో తీసుకెళ్లండి." 45 యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్లి, "బోధకుడా" అని అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. 46 వారు వచ్చి యేసును పట్టుకొని, ఆయనను బంధించారు.

50 అప్పుడు అందరు ఆయనను ఒంటరిగా విడిచి పారిపోయారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    43 ఆయన ఇంకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండు మందిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ పెద్దలూ పంపిన పెద్ద గుంపు అతనితో ఉంది. వారి దగ్గర కత్తులూ దుడ్డు కర్రలూ ఉన్నాయి. 44 ఆయనను అప్పగించేవాడు ముందుగానే వారికి ఒక గుర్తు చెప్పి, "నేనెవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. ఆయనను బంధించి తీసుకు వెళ్ళండి" అన్నాడు. 45 అతడు అక్కడికి చేరిన వెంటనే యేసు దగ్గరికి వచ్చి, "రబ్బీ!" అంటూ ఆయనను ముద్దుపెట్టుకున్నాడు. 46 అప్పుడు వారు యేసు మీద పడి గట్టిగా పట్టుకున్నారు.

    50 అప్పుడు యేసు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.