10 ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా, "ఎవరీయన?" అని కలవరంతో నిండిపోయింది. 11 ఆయనతో వచ్చిన జనసమూహం, "ఈయన యేసు. గలిలయలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్త" అని వారికి జవాబిచ్చారు.
ఆలయం శుద్ధి చేయడం
మార్కు 11:15-18; లూకా 19:45-47; యోహా 2:13-16
12 యేసు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ అమ్మేవారిని కొనేవారిని అందరినీ వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేసేవారి బల్లలనూ, పావురాలు అమ్మేవారి పీటలనూ పడదోశాడు. 13 వారితో ఇలా అన్నాడు, "‘నా ఆలయం ప్రార్థనకు నిలయం’ అని రాసి ఉంది. కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసేశారు."