Pular para o conteúdo
Publicidade

మత్తయి సువార్త 21:10-13

OTSA Telugu Contemporary Version

10 యేసు యెరూషలేములో ప్రవేశించినప్పుడు, పట్టణమంతా కలవరపడి, "ఈయన ఎవరు?" అని అడిగారు.

11 అందుకు ఆ జనసమూహం, "ఈయన యేసు, గలిలయ ప్రాంతంలోని నజరేతు గ్రామం నుండి వచ్చిన ప్రవక్త" అని జవాబిచ్చారు.

దేవాలయంలో యేసు

12 యేసు దేవాలయ ఆవరణంలో ప్రవేశించి అక్కడ అమ్ముతూ, కొంటూ ఉన్నవారినందరిని తరిమివేశారు. డబ్బు మార్చే వారి బల్లలను, గువ్వలను, అమ్మేవారి పీటలను ఆయన పడవేశారు. 13 ఆయన వారితో, " ‘నా మందిరం ప్రార్థన మందిరం అని పిలువబడుతుందని వ్రాయబడి ఉంది కానీ మీరు దానిని దొంగల గుహగా చేశారు’ "21:13 యెషయా 56:7; యిర్మీయా 7:11 అన్నారు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    10 ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా, "ఎవరీయన?" అని కలవరంతో నిండిపోయింది. 11 ఆయనతో వచ్చిన జనసమూహం, "ఈయన యేసు. గలిలయలోని నజరేతు నుండి వచ్చిన ప్రవక్త" అని వారికి జవాబిచ్చారు.

    12 యేసు దేవాలయంలోకి వెళ్ళి అక్కడ అమ్మేవారిని కొనేవారిని అందరినీ వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేసేవారి బల్లలనూ, పావురాలు అమ్మేవారి పీటలనూ పడదోశాడు. 13 వారితో ఇలా అన్నాడు, "‘నా ఆలయం ప్రార్థనకు నిలయం’ అని రాసి ఉంది. కానీ మీరు దాన్ని దొంగల గుహగా చేసేశారు."

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.