Pular para o conteúdo
Publicidade

మత్తయి రాసిన సువార్త 26:69,70,72,74,75

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

పేతురు అబద్ధాలు

69 పేతురు బయట వసారాలో కూర్చుని ఉన్నాడు. ఒక పనిపిల్ల అతని దగ్గరికి వచ్చి, "నీవు గలిలయ వాడైన యేసుతో ఉన్నావు కదా?" అని అడిగింది. 70 అందుకు అతడు, "నీవు చెప్పే సంగతి నాకు తెలియదు" అని అందరి ముందూ అన్నాడు.

72 పేతురు మళ్ళీ ఒప్పుకోక ఈసారి ఒట్టు పెట్టుకుంటూ, "ఆ మనిషి ఎవరో నాకు తెలియదు" అన్నాడు.

74 దానితో పేతురు, "ఆ మనిషిని నేను ఎరగనే ఎరగను" అంటూ, ఒట్లు, శాపనార్ధాలూ పెట్టుకోవడం ప్రారంభించాడు. ఆ వెంటనే కోడి కూసింది.

75 "ఈ రాత్రి కోడి కూసే ముందే నేనెవరో తెలియదని నువ్వు మూడుసార్లు చెబుతావు" అని యేసు తనతో చెప్పిన సంగతి జ్ఞాపకం చేసుకుని పేతురు బయటికి వెళ్ళి ఎంతో దుఃఖంతో పెద్దగా ఏడ్చాడు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    69 పేతురు బయట ప్రాంగణంలో కూర్చుని ఉన్నప్పుడు, అక్కడ ఒక దాసియైన అమ్మాయి అతని దగ్గరకు వచ్చింది. "నీవు కూడా గలిలయవాడైన యేసుతో ఉన్నవాడివే" అన్నది.

    70 అయితే పేతురు అందరి ముందు తిరస్కరించి, "నీవు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు" అన్నాడు.

    72 పేతురు ఈసారి ఒట్టు పెట్టుకొంటూ, "అతడు నాకు తెలియదు" అని మళ్ళీ తిరస్కరించాడు.

    74 అప్పుడు పేతురు శపించడం మొదలుపెట్టి, "అతని గురించి నాకు తెలియదు!" అని వారితో ప్రమాణం చేశాడు.

    వెంటనే కోడి కూసింది. 75 "కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదు అని మూడుసార్లు చెప్తావు" అని యేసు తనతో చెప్పిన మాటను పేతురు జ్ఞాపకం చేసుకుని బయటకు వెళ్లి ఎంతో బాధతో ఏడ్చాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.