పేతురు యేసును ఎరుగననుట
69 పేతురు బయట ప్రాంగణంలో కూర్చుని ఉన్నప్పుడు, అక్కడ ఒక దాసియైన అమ్మాయి అతని దగ్గరకు వచ్చింది. "నీవు కూడా గలిలయవాడైన యేసుతో ఉన్నవాడివే" అన్నది.
70 అయితే పేతురు అందరి ముందు తిరస్కరించి, "నీవు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు" అన్నాడు.
72 పేతురు ఈసారి ఒట్టు పెట్టుకొంటూ, "అతడు నాకు తెలియదు" అని మళ్ళీ తిరస్కరించాడు.
74 అప్పుడు పేతురు శపించడం మొదలుపెట్టి, "అతని గురించి నాకు తెలియదు!" అని వారితో ప్రమాణం చేశాడు.
వెంటనే కోడి కూసింది. 75 "కోడి కూయక ముందే నేనెవరో నీకు తెలియదు అని మూడుసార్లు చెప్తావు" అని యేసు తనతో చెప్పిన మాటను పేతురు జ్ఞాపకం చేసుకుని బయటకు వెళ్లి ఎంతో బాధతో ఏడ్చాడు.