6 యెహోవా ఇలా అన్నాడు.
"మీరు ఇప్పుడు నా మాటలు వినండి.
మీ మధ్య నా ప్రవక్త ఎవరన్నా ఉంటే, నేను అతనికి స్వప్నాల ద్వారా దర్శనం ఇస్తాను.
కలల ద్వారా అతనితో మాట్లాడతాను.
7 నా సేవకుడు మోషే అలాంటి వాడు కాదు.
అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు.
8 నేను అతనితో స్వప్నాల్లోనో, నిగూఢమైన రీతిలోనో మాట్లాడను.
ముఖాముఖీగా మాట్లాడతాను.
అతడు నా స్వరూపాన్ని చూస్తాడు.
అలాంటప్పుడు నా సేవకుడైన మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు?"