6 ఆయన, "నా మాటలు వినండి:
"ఒకవేళ మీ మధ్య ప్రవక్త ఉంటే,
యెహోవానైన నేను దర్శనాలలో వారికి ప్రత్యక్షమవుతాను,
కలలలో నేను వారితో మాట్లాడతాను.
7 అయితే నా సేవకుడైన మోషే విషయంలో ఇలా కాదు;
అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్థుడు.
8 అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతాను,
పొడుపుకథల్లా కాక స్పష్టంగా మాట్లాడతాను.
అతడు యెహోవా రూపాన్ని చూస్తాడు.
అలాంటప్పుడు మీరెందుకు భయపడకుండా
నా సేవకుడైన మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు?"