Pular para o conteúdo
Publicidade

సామెతలు 6:1-5

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

సోమరితనం గురించి హెచ్చరిక

1 కుమారా, నీ పొరుగువాడి కోసం హామీగా ఉన్నప్పుడు, పొరుగువాడి పక్షంగా వాగ్దానం చేసినప్పుడు, 2 నువ్వు పలికిన మాటలే నిన్ను చిక్కుల్లో పడవేస్తాయి. నీ నోటి మాటల వల్ల నువ్వు పట్టబడతావు.

3 కుమారా, నీ పొరుగువాడి చేతిలో చిక్కుబడినప్పుడు నువ్వు త్వరగా వెళ్లి నిన్ను విడుదల చేయమని అతణ్ణి బతిమాలుకో.

4 నీ కళ్ళకు నిద్ర రాకుండా, నీ కనురెప్పలకు కునుకుపాట్లు రానివ్వకుండా ఈ విధంగా చేసి దాని నుండి తప్పించుకో.

5 వేటగాడి బారి నుండి లేడి తప్పించుకున్నట్టు, బోయవాడి వల నుండి పక్షి తప్పించుకున్నట్టు తప్పించుకో.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 నా కుమారుడా, నీవు నీ పొరుగువాని రుణానికి భద్రత ఇచ్చివుంటే,

    చేతిలో చేయి వేసి అపరిచితునికి హామీ ఇచ్చివుంటే,

    2 నీవు పలికిన దాని వలన చిక్కుబడి ఉన్నావు,

    నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు.

    3 నా కుమారుడా, నీవు నీ పొరుగువారి చేతుల్లో పడ్డావు,

    కాబట్టి నిన్ను నీవు విడిపించుకోడానికి ఇలా చేయాలి:

    వెళ్లి అలసిపోయేవరకు,6:3 లేదా నిన్ను నీవు తగ్గించుకొని

    నీ పొరుగువారికి విశ్రాంతి ఇవ్వకు!

    4 నీ కళ్ళకు నిద్ర గాని,

    నీ కనురెప్పలకు కునుకు గాని రానియ్యకు.

    5 వేటగాని చేతి నుండి జింక తప్పించుకున్నట్లుగా,

    బోయవాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లుగా, నీవు తప్పించుకో.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.