మూర్ఖత్వానికి వ్యతిరేకంగా హెచ్చరికలు
1 నా కుమారుడా, నీవు నీ పొరుగువాని రుణానికి భద్రత ఇచ్చివుంటే,
చేతిలో చేయి వేసి అపరిచితునికి హామీ ఇచ్చివుంటే,
2 నీవు పలికిన దాని వలన చిక్కుబడి ఉన్నావు,
నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు.
3 నా కుమారుడా, నీవు నీ పొరుగువారి చేతుల్లో పడ్డావు,
కాబట్టి నిన్ను నీవు విడిపించుకోడానికి ఇలా చేయాలి:
వెళ్లి అలసిపోయేవరకు,6:3 లేదా నిన్ను నీవు తగ్గించుకొని
నీ పొరుగువారికి విశ్రాంతి ఇవ్వకు!
4 నీ కళ్ళకు నిద్ర గాని,
నీ కనురెప్పలకు కునుకు గాని రానియ్యకు.
5 వేటగాని చేతి నుండి జింక తప్పించుకున్నట్లుగా,
బోయవాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లుగా, నీవు తప్పించుకో.