Pular para o conteúdo
Publicidade

కీర్తనలు 139:1-4,23,24

IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

1 యెహోవా, నన్ను పరీక్షించి నా గురించి పూర్తిగా తెలుసుకున్నావు.

2 నేను కూర్చోవడం, నా నడక అంతా నీకు తెలుసు. నా మనసులో ఆలోచన పుట్టక ముందే అది నీకు తెలుసు.

3 నేను వెళ్ళే స్థలాలు, నేను నిద్రించే నా పడక నువ్వు పరిశీలనగా చూస్తావు. నేను చేసే పనులన్నీ నీకు క్షుణ్ణంగా తెలుసు.

4 యెహోవా, నా నోట మాట రాకముందే అది నీకు పూర్తిగా తెలుసు.

23 దేవా, నన్ను పరిశోధించు. నా హృదయంలో ఏమున్నదో పరిశీలించి చూడు. నన్ను పరీక్షించి నా ఆలోచనలు ఎలాంటివో తెలుసుకో.

24 నీకు బాధ కలిగించే విధానాలు నేను అనుసరిస్తున్నానేమో నన్ను పరిశీలించు. శాశ్వత మార్గంలో నన్ను నడిపించు.

Em outras traduções

  1. OTSA Telugu Contemporary Version

    1 యెహోవా మీరు నన్ను పరిశోధించారు,

    మీరు నన్ను తెలుసుకొన్నారు.

    2 నేను కూర్చోవడం నేను లేవడం మీకు తెలుసు;

    దూరం నుండే నా తలంపులు మీరు గ్రహించగలరు.

    3 నేను బయటకు వెళ్లడాన్ని పడుకోవడాన్ని మీరు పరిశీలిస్తారు;

    నా మార్గాలన్నీ మీకు బాగా తెలుసు.

    4 యెహోవా, నా నాలుక మాట పలుకక ముందే,

    అదేమిటో మీకు పూర్తిగా తెలుసు.

    23 దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకోండి;

    నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకోండి.

    24 చెడుమార్గమేదైనా నాలో ఉన్నదేమో చూడండి,

    నిత్యమైన మార్గంలో నన్ను నడిపించండి.139:24 కీర్తన 3:8 ఫుట్‌నోట్ చూడండి

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.