1 యెహోవా మీరు నన్ను పరిశోధించారు,
మీరు నన్ను తెలుసుకొన్నారు.
2 నేను కూర్చోవడం నేను లేవడం మీకు తెలుసు;
దూరం నుండే నా తలంపులు మీరు గ్రహించగలరు.
3 నేను బయటకు వెళ్లడాన్ని పడుకోవడాన్ని మీరు పరిశీలిస్తారు;
నా మార్గాలన్నీ మీకు బాగా తెలుసు.
4 యెహోవా, నా నాలుక మాట పలుకక ముందే,
అదేమిటో మీకు పూర్తిగా తెలుసు.
23 దేవా, నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకోండి;
నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకోండి.
24 చెడుమార్గమేదైనా నాలో ఉన్నదేమో చూడండి,
నిత్యమైన మార్గంలో నన్ను నడిపించండి.139:24 కీర్తన 3:8 ఫుట్‌నోట్ చూడండి