9 సీయోను నివాసులారా, సంతోషించండి.
యెరూషలేము నివాసులారా, ఉల్లాసంగా ఉండండి.
నీ రాజు నీతితో, రక్షణ తీసుకుని, దీనుడై,
గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడు.
10 నేను ఎఫ్రాయిములో రథాలుండకుండా చేస్తాను.
యెరూషలేములో గుర్రాలు లేకుండా చేస్తాను.
యుద్ధపు విల్లు లేకుండా పోతుంది.
నీ రాజు సమాధానవార్త అన్యప్రజలకు తెలియజేస్తాడు. ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకూ యూఫ్రటీసు నది మొదలు భూదిగంతం వరకూ అతడు పరిపాలిస్తాడు.