సీయోను రాజు వచ్చుట
9 సీయోను కుమారీ, గొప్పగా సంతోషించు!
యెరూషలేము కుమారీ, ఆనందంతో కేకలు వేయి!
ఇదిగో నీతిమంతుడు, జయశీలియైన మీ రాజు
దీనుడిగా గాడిద మీద,
గాడిదపిల్ల మీద స్వారీ చేస్తూ
మీ దగ్గరకు వస్తున్నాడు.
10 నేను ఎఫ్రాయింలో రథాలు లేకుండా చేస్తాను
యెరూషలేములో యుద్ధ గుర్రాలు లేకుండా చేస్తాను
యుద్ధపు విల్లు విరిగిపోతుంది.
ఆయన దేశాలకు సమాధానాన్ని ప్రకటిస్తారు.
ఆయన రాజ్యం సముద్రం నుండి సముద్రం వరకు
నది9:10 అంటే, యూఫ్రటీసు నుండి భూమి అంచుల వరకు ఉంటుంది.