Pular para o conteúdo
Publicidade

1 రాజులు 18:41-45

OTSA Telugu Contemporary Version

41 తర్వాత ఏలీయా అహాబుతో, "భారీ వర్షం వచ్చే ధ్వని వస్తుంది, నీవు వెళ్లి అన్నపానాలు పుచ్చుకో" అన్నాడు. 42 కాబట్టి అహాబు అన్నపానాలు పుచ్చుకోడానికి వెళ్లాడు, కాని ఏలీయా కర్మెలు పర్వత శిఖరం మీదికి వెళ్లి, అక్కడ అతడు నేల మీద పడి ముఖం మోకాళ్ల మధ్య పెట్టుకున్నాడు.

43 తర్వాత అతడు తన సేవకుని పిలిచి, "నీవు వెళ్లి సముద్రం వైపు చూడు" అన్నాడు. అతడు వెళ్లి చూశాడు.

"అక్కడ ఏమి లేదు" అని అతడు జవాబిచ్చాడు.

ఏలీయా ఏడుసార్లు, "వెళ్లి చూడు" అని చెప్పాడు.

44 ఏడవసారి సేవకుడు వచ్చి, "మనిషి చేయి అంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి లేస్తూ ఉంది" అని చెప్పాడు.

అందుకు ఏలీయా, "నీవు వెళ్లి అహాబుతో, ‘వర్షం నిన్ను ఆపక ముందే నీ రథం సిద్ధం చేసుకుని వెళ్లు’ అని చెప్పు" అన్నాడు.

45 అంతలో ఆకాశం మబ్బులతో చీకటిగా మారింది, గాలి వీచింది, భారీ వర్షం కురవడం మొదలయ్యింది. అహాబు రథమెక్కి యెజ్రెయేలుకు వెళ్లాడు.

Em outras traduções

  1. IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019

    41 ఏలీయా "పెద్ద వాన కురుస్తున్న శబ్దం వస్తున్నది. నీవు వెళ్లి భోజనం చెయ్యి" అని అహాబుతో చెప్పాడు. 42 అహాబు భోజనం చేయడానికి వెళ్ళాడు గాని, ఏలీయా కర్మెలు పర్వతం ఎక్కి నేలమీద పడి ముఖం మోకాళ్ల మధ్య పెట్టుకున్నాడు. 43 తరువాత అతడు తన సేవకుణ్ణి పిలిచి "నీవు పైకి వెళ్లి సముద్రం వైపు చూడు" అన్నాడు. వాడు మెరక ఎక్కి చూసి "ఏమీ కనబడ్డం లేదు" అన్నాడు. అతడు ఇంకా ఏడు సార్లు "వెళ్లి చూడు" అన్నాడు. 44 ఏడో సారి అతడు చూసి "అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘం, సముద్రం నుంచి పైకి లేస్తూ ఉంది" అన్నాడు. అప్పుడు ఏలీయా "నీవు అహాబు దగ్గరికి వెళ్లి, నీ రథాన్ని సిద్ధ పరచుకో, వానలో చిక్కుకుపోక ముందే వెళ్ళిపో" అని చెప్పమని అతన్ని పంపాడు.

    45 అంతలోనే ఆకాశం కారుమేఘాలు కమ్మింది. దానికి గాలి తోడైంది. వాన జోరుగా కురిసింది. అహాబు రథమెక్కి యెజ్రెయేలు పట్టణం వెళ్లిపోయాడు.

Direitos das traduções citadas

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.