Pular para o conteúdo
Publicidade

2 కొరింథీ పత్రిక 4

ప్రస్తుత బలహీనత, పునరుత్థాన జీవితం

1 దేవుని కనికరాన్ని బట్టి ఈ పరిచర్యను మేము కలిగి ఉన్నాము, కాబట్టి మేము ధైర్యాన్ని కోల్పోము. 2 అయితే సిగ్గుపడాల్సిన రహస్యమైన పనులను విడిచిపెట్టాం; మోసాన్ని చేయడం లేదు, దేవుని వాక్యాన్ని వంకరగా బోధించకుండా సత్యాన్ని స్పష్టంగా ప్రకటించడం ద్వారా దేవుని దృష్టిలో ప్రతివాని మనస్సాక్షికి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము. 3 ఒకవేళ మేము బోధించే సువార్త ఎవరికైనా మురుగు చేయబడి ఉంటే అది నశించేవారికి మాత్రమే. 4 దేవుని స్వరూపియైన క్రీస్తు మహిమను తెలియజేసే సువార్త వెలుగును వారు చూడకుండ ఈ యుగసంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనస్సుకు గ్రుడ్డితనం కలుగజేసింది. 5 ఎందుకంటే మా గురించి మేము ప్రకటించడం లేదు కాని యేసు క్రీస్తు ప్రభువని, యేసు కోసం మేము మీ సేవకులమని ప్రకటిస్తున్నాము. 6 "చీకటి నుండి వెలుగు ప్రకాశించును గాక"4:6 ఆది 1:3 అని పలికిన ఆ దేవుడే క్రీస్తు ముఖంపై ప్రకాశించే దైవ మహిమను, జ్ఞానమనే వెలుగును మాకు ఇవ్వడానికి మా హృదయాల్లో తన వెలుగును ప్రకాశింపజేశారు.

7 అయితే ఈ అత్యధిక శక్తి అంతా దేవునిదే గాని మాది కాదు అని చూపించడానికి, మేము మట్టి పాత్రల్లో ఈ సంపదను కలిగి ఉన్నాము. 8 మేము అన్ని వైపుల నుండి తీవ్రమైన శ్రమలకు గురయ్యాం కాని నలిగిపోలేదు; ఆందోళన కలిగినా నిరాశ చెందలేదు; 9 హింసించబడినా విడిచిపెట్టబడలేదు; పడత్రోయబడినా నాశనమవ్వలేదు. 10 మా శరీరంలో యేసు జీవం ప్రత్యక్షపరచబడాలని ఆయన మరణాన్ని మా శరీరంలో ఎప్పుడు మోస్తునే ఉన్నాము. 11 మా క్షయమైన శరీరంలో యేసు జీవం ప్రత్యక్షపరచబడాలని సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు కొరకై మరణానికి అప్పగించబడుతున్నాము. 12 కాబట్టి మాలో మరణం పని చేస్తుంది, కాని మీలో జీవం పని చేస్తుంది.

13 "నేను విశ్వసించాను కాబట్టి మాట్లాడాను"4:13 కీర్తన 116:10 అని వ్రాయబడి ఉంది. అదే విశ్వాసపు ఆత్మ మాలో కూడా ఉంది, కాబట్టి మేము కూడా విశ్వసిస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాము. 14 ఎందుకంటే, ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన దేవుడు, యేసుతో పాటు మమ్మల్ని కూడా లేవనెత్తి మీతో పాటు తన ఎదుట నిలబెడతారని మాకు తెలుసు. 15 ఇదంతా మీ మేలు కోసమే, అప్పుడు దేవుని కృప అధికంగా వ్యాపించి ప్రజలు అధిక సంఖ్యలో దేవుని మహిమకు విస్తారంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు.

16 కాబట్టి మేము ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోము. మేము బాహ్యంగా క్షీణిస్తున్నా, అంతరంగంలో దినదినం నూతనపరచబడుతున్నాము. 17 మేము అనుభవిస్తున్న ఈ క్షణికమైన తేలికైన కష్టాలు వాటికన్నా ఎంతో అధికమైన నిత్య మహిమను సంపాదిస్తున్నాయి. 18 కాబట్టి కనిపించే వాటిపై కాక కనిపించని వాటిపై మా దృష్టిని నిలిపాము. ఎందుకంటే కనిపించేవి తాత్కాలికమైనవి, కనిపించనివి శాశ్వతమైనవి.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.