8 మేము అన్ని వైపుల నుండి తీవ్రమైన శ్రమలకు గురయ్యాం కాని నలిగిపోలేదు; ఆందోళన కలిగినా నిరాశ చెందలేదు; 9 హింసించబడినా విడిచిపెట్టబడలేదు; పడత్రోయబడినా నాశనమవ్వలేదు. 10 మా శరీరంలో యేసు జీవం ప్రత్యక్షపరచబడాలని ఆయన మరణాన్ని మా శరీరంలో ఎప్పుడు మోస్తునే ఉన్నాము. 11 మా క్షయమైన శరీరంలో యేసు జీవం ప్రత్యక్షపరచబడాలని సజీవులమైన మేము ఎల్లప్పుడు యేసు కొరకై మరణానికి అప్పగించబడుతున్నాము.
Publicidade
2 కొరింథీ పత్రిక 4:8-11
OTSA Telugu Contemporary Version
Em outras traduções
- IRVTEL Versão Revisada Indiana (IRV) - Telugu - 2019
8 అన్ని రకాలుగా బాధలు పడుతున్నా మేము చితికిపోవడం లేదు. ఎటూ పాలుబోని పరిస్థితుల్లో ఉంటున్నాం గానీ కృంగిపోవడం లేదు. 9 చిత్రహింసలు అనుభవించాం గానీ దిక్కుమాలిన వాళ్ళం కాము. మమ్మల్ని కొట్టి పడేశారు కానీ నాశనం అయిపోవడం లేదు. 10 యేసు జీవం మా దేహాల్లో కనబడేలా యేసు మరణాన్ని మా దేహంలో ఎప్పుడూ మోసుకుపోతున్నాము. 11 యేసు జీవం మా మానవ దేహాల్లో కనబడేలా, బతికి ఉన్న మేము ఎప్పుడూ యేసు కోసం చావుకు లోనవుతూనే ఉన్నాము.
Direitos das traduções citadas
Estes versículos te tocaram? Ore agora!
+581 estão orando agora.
Junte-se à corrente de oração.