Pular para o conteúdo
Publicidade

2 కొరింథీ పత్రిక 5:1-8

నూతన శరీరం కోసం వేచివుండటం

1 మనం నివసిస్తున్న భూసంబంధమైన గుడారం నాశనమైనా, మానవ నిర్మితం కాని దేవుడు కట్టిన ఒక శాశ్వతమైన గృహం పరలోకంలో ఉందని మనకు తెలుసు. 2 ఈలోగా పరలోకం నుండి వచ్చే మన నివాసాన్ని ధరించుకోవాలని ఆశపడుతూ మనం మూలుగుతున్నాము. 3 ఎందుకంటే దాన్ని ధరించుకుంటే మనం దిగంబరులుగా కనబడము. 4 ఈ గుడారంలో ఉన్నంతసేపు మనం భారం మోస్తూ మూల్గుతూ ఉన్నాం, ఎందుకంటే, మనం దిగంబరులుగా ఉండాలని కోరుకోం కాని చనిపోయేది జీవం చేత మ్రింగివేయబడేలా, మన పరలోక నివాసాన్ని ధరించుకోవాలని కోరుతున్నాము. 5 దీని కోసం మనల్ని సిద్ధపరచింది దేవుడే; ఆయనే రాబోయే దానికి హామీగా తన ఆత్మను మనకు ఇచ్చారు.

6 కాబట్టి మనం ఎల్లప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉన్నాం, ఈ దేహంలో నివసించేంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు తెలుసు. 7 మనం కంటికి కనిపించే దాన్ని కాక, విశ్వాసం వల్ల జీవిస్తున్నాము. 8 కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం సంపూర్ణ నమ్మకం కలిగి ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రభువు దగ్గర నివసించాలని ఎంతగానో ఇష్టపడుతున్నాము.

Estes versículos te tocaram? Ore agora!

+581 estão orando agora.

Junte-se à corrente de oração.